Ipl franchise profit Making.. depends only on sponsers
#Ipl2022
#MumbaiIndians
#Chennaisuperkings
#Bcci

ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు వచ్చేశాయి. లక్నో అహ్మదాబాద్ బేస్‌లుగా రెండు నూతన ఫ్రాంచైజీలను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ బేస్ ప్రైజ్‌కు 160 శాతం అదనంగా చెల్లించి రూ. 5,625 కోట్లకు కొనుగోలు చేయగా... లక్నో జట్టును బిజినెస్ టైకూన్ సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ రూ. 7090 కోట్లకు 250 శాతం అదనంగా వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీల రాకతో భారత క్రికెట్ బోర్డుపై మరోసారి కాసుల వర్షం కురిసింది. ఏకంగా బీసీసీఐ ఖజానాలోకి రూ. 12,715 కోట్లు చేరనున్నాయి